మాధవరెడ్డిహత్యపై అసెంబ్లీలో వాగ్యుద్ధం
మాధవరెడ్డిహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూఆయన సోదరుడు కృష్ణారెడ్డి సిబిఐవిచారణకు డిమాండ్ చేస్తే అప్పటితెలుదేశం ప్రభుత్వం ఎందుకుపట్టించుకోలేదని నగేష్ అడిగారు.మాధవరెడ్డి అజాతశత్రువు అని,అటువంటి మాధవరెడ్డిని నల్లగొండజిల్లా సరిహద్దులు దాటిన తర్వాతహత్య చేశారని ఆయన చెప్పారు.సభలోనే ఉన్న తెలుగుదేశంశాసనసభ్యురాలు, మాధవరెడ్డిసతీమణి ఉమామాధవరెడ్డిప్రతిస్పందిస్తూ మాధవరెడ్డివిధానాలకు కట్టుబడి పని చేశారని, ఆ విధానాలకారణంగానే నక్సలైట్లుమాధవరెడ్డిని హత్య చేశారనిఅన్నారు. రాజకీయ లబ్ధి కోసం టి ఆర్‌యస్‌మాధవరెడ్డి హత్యను వాడుకునేప్రయత్నం చేస్తోందని ఆమెవిమర్శించారు.
ఆమెమాటలకు టి ఆర్‌యస్ సభ్యుడుమందడి సత్యనారాయణ రెడ్డిప్రతిస్పందిస్తూ తన సోదరుడుమాధవరెడ్డికి తెలుగుదేశంపార్టీలో అంతర్గత శత్రువులున్నారని,వారే మాధవరెడ్డిని హత్యచేయించారని కృష్టారెడ్డి ఆరోపిస్తే అప్పటితెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదనిఅన్నారు. దీనికి ఉమా మాధవరెడ్డిప్రతిస్పందిస్తూ కృష్ణారెడ్డి టిఆర్‌యస్‌లో చేరి తన భర్తమాధవరెడ్డి హత్యను రాజకీయంచేసి తన సొంత మరదలినే(తననే) ఓడించడానికి పూనుకున్నారనిఅన్నారు. దీనికి టిఆర్‌యస్ సభ్యులు తీవ్రఅభ్యంతరం తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!