కరీంనగర్‌జిల్లాలో ఎన్‌కౌంటర్లు: మహిళా నక్సల్‌మృతి
కథాలాపూర్‌మండలం తక్కపల్లి ఎన్‌కౌంటర్ నుంచితప్పించుకుని పారిపోయిన శోభక్క,ఇతర నక్సల్స్ కోసం పోలీసులు గాలింపుచేపట్టారు. పోలీసులు గాలింపు జరుపుతూవెళ్తుండగా సంగెం వద్దనక్సల్స్ తారసపడ్డారు. ఈ సమయంలోఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులుజరిగాయి.
కరీంనగర్ జిల్లా కథలాపూర్‌మండలం తక్కళ్లపల్లి వద్దపోలీసులకు, మావోయిస్టు నక్సలైట్లకుమధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సిపిఐ (మావోయిస్టు)శోభక్క దళం ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లుభావిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచిపోలీసులు మూడు కిట్ బ్యాగులు, ఒకఆయుధం స్వాధీనం చేసుకున్నారు.ఎన్‌కౌంటర్ నుంచి 12 మంది నక్సలైట్లుతప్పించుకున్నట్లు భావిస్తున్నారు.
నిజామాబాద్‌జిల్లా కామారెడ్డి డివిజన్‌లో పోలీసులుఆరుగురు మావోయిస్టుసానుభూతిపరులను అరెస్టు చేశారు. వారినుంచి మారణాయుధాలను స్వాధీనంచేసుకున్నారు.
ఇదిలావుంటే, ప్రకాశం జిల్లా అర్థవీడుమండలం భీమరాయుని చెంచుగూడెంగిరిజన ఆశ్రమ పాఠశాల భవనాన్నిమావోయిస్టు నక్సలైట్లుపేల్చివేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!