రెండేళ్లలోఫ్లోరైడ్ గ్రామాలకు విముక్తి: వైయస్
నల్లగొండ:నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి వరాల జల్లుకురిపించారు. రెండేళ్లలో నల్లగొండజిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకురక్షిత మంచినీటిని అందిస్తామని ఆయనహామీ ఇచ్చారు. నల్లగొండలో ఆయనబుధవారం రాజీవ్ నగరబాటలోపాల్గొన్నారు. పానగల్లు వద్ద గ్రామీణమంచినీటి పథకాన్ని ప్రారంభించారు.నల్లగొండ పట్టణానికి నీరందించేపథకాన్ని కూడా ఆయనప్రారంభించారు.
రెండేళ్లలోనల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకుపరిష్కారం చూపుతామని ఆయనచెప్పారు. నాగార్జునసాగర్ ఎడమకాలువకు ఈ నెలాఖరున నీరు విడుదలచేస్తామని ఆయన చెప్పారు. ముస్లింరిజర్వేషన్లలో మూడేళ్లలో అమలులోకితెస్తామని, ఈ విషయంలోన్యాయపరమైన చిక్కులనుఅధిగమించడానికి కృషి చేస్తున్నామనిఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
