రాష్ట్రపతిముందు 41 మంది ఎమ్యెల్యేల పరేడ్‌

న్యూఢిల్లీ/రాంచీ/ పాట్నా: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శిబూ సోరేన్‌ గద్దెదిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమబలనిరూనణ కోసం భారతీయ జనతా పార్టీ(బిజెపి) నాయకులు 41 మందిశాసనసభ్యులను రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌ ముందుప్రవేశపెట్టారు. తనకు అందినసమన్ల మేరకు జార్ఖండ్‌గవర్నర్‌ సయ్యద్‌ సబ్తే రజీ కూడాఢిల్లీకి చేరుకున్నారు. 30 మంది బిజెపిశాసనసభ్యులు, ఆరుగురు జెడి (యు)శాసనసభ్యులు, యన్‌డిఎకుమద్దతిస్తున్న ఐదుగురుఇండిపెండెంట్‌ సభ్యులు బిజెపి అధినేతఎల్‌.కె. అద్వానీ, మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడులతో కలిసిరాష్ట్రపతిభవన్‌కు గుజరాత్‌భవన్‌ నుంచి బస్సులోచేరుకున్నారు.

యన్‌డిఎకుమద్దతిస్తున్న ఐదుగురు ఇండిపెంట్లువెంకయ్యనాయుడు వెంట రాష్ట్రపతిభవన్‌కు చేరుకున్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఒకబిజెపి సభ్యుడిని స్ట్రెచర్‌ మీదరాష్ట్రభవన్‌కు తీసుకొచ్చారు. 41 మందిశాసనసభ్యులను మొదట పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఉంచారు. ఆతర్వాత పశ్చిమ బెంగాల్‌లోని మరోచోటి తరలించారు. అక్కడి నుంచిరహస్య మార్గంలో ఒరిస్సాలోనిభువనేశ్వర్‌కు తీసుకెళ్లారు. అక్కడినుంచి న్యూఢిల్లీకి విమానంలో చేర్చారు.ఫలితాలు వెలువడిన మరుక్షణంనుంచే యన్‌డిఎ పకడ్బందీగా క్యాంపునిర్వహించినట్లు దీన్ని బట్టిఅర్థమవుతోంది.

ఇదిలావుంటే, శిబూ సోరేన్‌కు మరోఎదురుదెబ్బ తగిలింది. సిపిఐ (యంయల్‌)శాసనసభ్యుడు దీపాంకర్‌ భట్టాచార్యయుపిఎకు మద్దతిచ్చే ప్రసక్తి లేదనితేల్చి చెప్పారు. జార్ఖండ్‌ శాసనసభలోమొత్తం 81 సీట్లున్నాయి. 41 మంది సభ్యులమద్దతు తమకు ఉన్నదనియన్‌డిఎ స్పష్టం చేసి, ఆశాసనసభ్యుల జాబితాను గవర్నర్‌కుసమర్పించింది. అయితే 42 మందిశాసనసభ్యుల మద్దతు తనకుఉన్నదని శిబూ సోరేన్‌ చెప్పారంటూగవర్నర్‌ సిబ్తే రజీ ప్రభుత్వఏర్పాటుకు ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకుఆహ్వానించారు. దీంతో శిబూ సోరేన్‌ చేతముఖ్యమంత్రిగా హడావిడి ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రిగా జెయంయం తిరుగుబాటుఅభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన స్టీఫెన్‌మారండీ ప్రమాణం చేశారు. మరోనలుగురు మంత్రుల చేత కూడాప్రమాణ స్వీకారం చేయించారు. మార్చి21వ తేదీలోగా బలనిరూపణ చేసుకోవాలనిగవర్నర్‌ సిబ్తే రజీ శిబూ సోరేన్‌గుడువు పెట్టారు. ఇదంతా నాటకీయంగాజరిగిపోయింది.

శిబూసోరేన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి,అర్జున్‌ ముండా నేతృత్వంలోయన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనిరాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌కుచెప్పనట్లు బిజెపి అధ్యక్షుడు ఎల్‌.కె.అద్వానీ చెప్పారు. రాష్ట్రపతి ముందుఎమ్యెల్యేల పరేడ్‌ అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడారు. శిబూ సోరేన్‌వెంటనే రాజీనామా చేయాలని ఆయనడిమాండ్‌ చేశారు. జార్ఖండ్‌లోప్రజాస్వామ్యం ఖూనీ జరిగిందని ఆయనవిమర్శించారు. కాగా, ఢిల్లీకిచేరుకున్న జార్ఖండ్‌ గవర్నర్‌సయ్యద్‌ సబ్తే రజీ శుక్రవారంరాష్ట్రపతిని కలుసుకుంటారు.గవర్నర్‌ కలిసిన తర్వాతనే ఏంచేయాలనే విషయంపై రాష్ట్రపతినిర్ణయం తీసుకుంటారు.

ఈనెల 21వ తేదీన తాను శాసనసభలోబలాన్ని నిరూపించుకుంటానని శిబూ సోరేన్‌విలేకరులతో అన్నారు. ముఖ్యమంత్రిపదవి చేపట్టిన తర్వాత ఆయనతొలిసారి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. తమకు మద్దతు ఇస్తున్నఇండిపెండెంట్‌ సభ్యులు హరి నారాయణ్‌రాయ్‌ను, ఎనోస్‌ ఎక్కాను యన్‌డిఎబలవంతంగా తీసికెళ్లిందని ఆయనఆరోపించారు.

కాగా,తాజా పరిస్థితిపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియా గాంధీ, ఇతర సీనియర్‌కాంగ్రెస్‌ నేతలు ప్రధాని డాక్టర్‌మన్మోహన్‌ సింగ్‌ ఇంట్లోసమావేశమయ్యారు. జార్ఖండ్‌ప్రయోగమే బీహార్‌లో చేస్తారనే ప్రచారంఊపందుకున్న సమయంలో జార్ఖండ్‌వ్యవహారం కాంగ్రెస్‌ను ఖంగుతినిపించింది. దీంతో బీహార్‌లో రాష్ట్రపతిపాలనకే మొగ్గు చూపే అవకాశం ఉంది.ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపిని గానీ,ఆర్జేడీని గానీ ఆహ్వానించకూడదనిలోక్‌జనశక్తి నాయకుడు రాం విలాస్‌పాశ్వాన్‌ గవర్నర్‌ బూటా సింగ్‌నుకలిసి విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+