వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌ఉదంతం: గవర్నర్‌కు రాష్ట్రపతిసమన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:జార్ఖండ్‌ గవర్నర్‌ సయ్యద్‌ సిబ్తేరజీకి రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌గురువారం సమన్లు జారీ చేశారు. శిబూసోరేన్‌ నేతృత్వంలో ప్రభుత్వఏర్పాటుపై వివాదం చెలరేగిన నేపథ్యంలోరాష్ట్రపతి ఆ సమన్లు జారీ చేశారు.తనను తక్షణమే కలవాలనిరాష్ట్రపతి జార్ఖండ్‌ గవర్నర్‌నుఆదేశించారు. అయితే శుక్రవారంనాడుకలుస్తానని సబ్తే రజీ రాష్ట్రపతికితెలియజేశారు.

గవర్నర్‌చర్యను నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ (బిజెపి) నాయకులు బుధవారంసాయంత్రం రాష్ట్రపతిని కలిశారు.గవర్నర్‌ చర్యను బిజెపి తీవ్రంగావిమర్శిస్తోంది. గవర్నర్‌ రాజ్యాంగఉల్లంఘనకు పాల్పడిందని బిజెపివ్యాఖ్యానిస్తోంది. గవర్నర్‌ చర్యకునిరసనగా గురువారం జార్ఖండ్‌బంద్‌ను కూడా తలపెట్టింది. బంద్‌తోరాష్ట్రంలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి.గురువారం మధ్యాహ్నం వరకుఅవాంఛనీయ సంఘటనలేవీ జరగలేదు.గవర్నర్‌ను రీకాల్‌ చేసే వరకుతమ ఉద్యమం సాగుతుందని బిజెపిరాష్ట్ర అధ్యక్షుడు రఘువీర్‌ దాస్‌చెప్పారు. గురువారం ఉదయంఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో బిజెపికార్యకర్తలు హౌరా - బొకారో రైలునుదుగ్దాడి స్టేషన్‌ వద్ద ఆపారు.విషయం తెలిసిన వెంటనే పోలీసులుఅక్కడికి బయలుదేరి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X