తెలంగాణపైఏకాభిప్రాయసాధన మీదనే కమిటీనివేదిక
హైదరాబాద్:ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోనిఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) కమిటీతెలంగాణపై ఏకాభిప్రాయాన్ని ఎలా సాధించాలనేవిషయంపై మాత్రమే నివేదికసమర్పిస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు చెప్పారు. తాను ఇటీవలిఢిల్లీ పర్యటనలో ప్రణబ్ ముఖర్జీనికలిశానని, తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌యస్) అధినేత కె.చంద్రశేఖర్ రావు తననుకలవబోతున్నారని ప్రణబ్ తనకుచెప్పారని ఆయన గురువారంవిలేకరులతో చెప్పారు.
ప్రణబ్‌ముఖర్జీ కమిటీ తెలంగాణ ఏర్పాటు కోసంనివేదిక సమర్పించదని, తెలంగాణపైఏకాభిప్రాయ సాధనపై మాత్రమేనివదేక ఇస్తుందని ఆయన స్పష్టంచేశారు. నక్సలైట్లతో చర్చలపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనిఆయన చెప్పారు. అయితే ఏ ఒక్కరూచావకూడదు, చంపుకోకూడదనేదేతమ అభిప్రాయమని ఆయన అన్నారు.విమర్శలు, ప్రతివిమర్శలు ఎంతఘాటుగానైనా చేసుకోవచ్చు గానీ చంపడంసరి కాదని ఆయన అన్నారు. మనుషులప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని ఆయనఅన్నారు.












Click it and Unblock the Notifications
