జార్ఖండ్‌పైహోరెత్తిన పార్లమెంటు: వాయిదా
న్యూఢిల్లీ:జార్ఖండ్‌లో కాంగ్రెస్ - జెయంయంప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌తీసుకున్న చర్యలపై బిజెపినాయకత్వంలో యన్‌డిఎ సభ్యులు తీవ్రనిరసన వ్యక్తం చేయడంతోపార్లమెంటు ఉభయ సభలూ స్తంభించాయి.యన్‌డిఎ పక్షాల సభ్యులు తీవ్రగందరగోళం సృష్టించడంతోలోక్‌సభ కార్యక్రమాలేవీచేపట్టకుండానే వాయిదా పడింది.
మొదటలోక్‌సభ 30 నిమిషాల పాటు వాయిదా పడింది.సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలసభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలుచేశారు. దీంతో స్పీకర్ స్థానంలోకూర్చున్న దేవేంద్ర ప్రసాద్‌యాదవ్ సభను రేపటికి వాయిదావేశారు. గురువారం ఉదయం సభసమావేశం కాగానే యన్‌డిఎ సభ్యులుజార్ఖండ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనినినాదాలు చేస్తూ అల్లరికి దిగారు. దీంతోస్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభను 30నిమిషాల పాటు వాయిదా వేశారు.
జార్ఖండ్‌లోశిబూ సోరేన్ ప్రభుత్వం ఏర్పాటుకుసహకరించిన గవర్నర్ చర్యనురాజ్యసభలో ఎం. వెంకయ్యనాయుడు,ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్,మురళఋ మనోహర్ జోషీ, రాజన్‌నాథ్‌సింగ్ నిరసిస్తూ మాట్లాడడంమొదలుపెట్టారు. ఎంతకీ సభసద్దుమణగకపోవడంతో చైర్మన్‌బైరాన్ సింగ్ షెకావత్ సభనురేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
