మహాద్వారదుర్వినియోగంపై విచారణ: ఎమ్మెస్సార్
హైదరాబాద్:తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) మహాద్వారం దుర్వినియోగంఆరోపణలపై విచారణకు ఆదేశించామని,తప్పులు జరిగినట్లు రుజువైతేబాధ్యులైనవారిపై తగిన చర్యలుతీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు చెప్పారు.శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలోమంత్రి ఆ విషయం చెప్పారు. ఈ సమయంలోప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు, మంత్రిసత్యనారాయణ రావుల మధ్యవాగ్వివాదం జరిగింది.
తిరుమలలోరాజకీయాలు చేస్తున్నారని, టిటిడి డబ్బులుమళ్లిస్తున్నారని చంద్రబాబునాయుడువిమర్శించారు. తిరుమల పవిత్రతనుకాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తానుముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలోబ్రహ్మోత్సవాలలో మినహా మిగతా అన్నిసమయాల్లో క్యూలో వెళ్లానని, ఇప్పుడు చాలామంది ముఖద్వారం గుండా పోతున్నారని,దీనివల్ల పవిత్రత దెబ్బ తింటుందనిఆయన అన్నారు. రాజకీయాలు చేస్తే వేరేచోట్ల చేయాలి గానీ ఇక్కడ వద్దని ఆయనసలహా ఇచ్చారు.
తానుతిరుమల పవిత్రత కాపాడడానికికట్టుబడి వున్నానని, తాను కూడా క్యూలోవెళ్తున్నానని సత్యనారాయణ రావుచెప్పారు. అయితే దీనితో చంద్రబాబుఏకీభవించలేదు. పార్లమెంటు సభ్యులు,శాసనసభ్యులు ముఖద్వారం గుండావెళ్లడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారని ఆయన అన్నారు. దేవాదాయచట్టానికి భిన్నంగా ఒక ఉద్యోగి నియామకంకూడా జరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
