సోరేన్‌విశ్వాసానికి గడువు తగ్గింపు: రజీ

న్యూఢిల్లీ:జార్ఖండ్‌లో శిబూ సొరేన్‌ బలనిరూపణకుపెట్టిన గడువును తగ్గించనున్నట్లుగవర్నర్‌ సయ్యద్‌ సబ్తే రజీచెప్పారు. ఆయన శుక్రవారం ఉదయంరాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌నుకలుసుకున్నారు. శిబూ సోరేన్‌ ప్రభుత్వఏర్పాటుకు చర్యలు తీసుకున్నందుకురాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ రజీకిసమన్లు జారీ చేశారు. దీంతో ఆయనఢిల్లీకి వచ్చి రాష్ట్రపతినికలుసుకున్నారు. తాను తీసుకున్నచర్యపై ఆయన రాష్ట్రపతికి సంజాయిషీఇచ్చారు.

రాష్ట్రపతినికలిసిన అనంతరం రజీ విలేకరులతోమాట్లాడారు. శిబూ సోరేన్‌ బలపరీక్షకుతాను పెట్టిన గడువును 21వ తేదీనుంచి తగ్గించనున్నట్లు ఆయనతెలిపారు. రాజ్యాంగ నిబంధనలకుఅనుగుణంగా ప్రభుత్వ ఏర్పాటుకు శిబూసోరేన్‌ను ఆహ్వానించానని, ఇదే విషయాన్నితాను రాష్ట్రపతికి వివరించానని ఆయనచెప్పారు. తాను చెప్పిన విషయాలనురాష్ట్రపతి ఎంతో ఓపికతో విన్నారు.

ఒకవేళతప్పు చేశారని భావించినా గవర్నర్‌పైచర్య తీసుకునే అవకాశంరాష్ట్రపతికి లేదు. గవర్నర్‌పైరాష్ట్రపతి చర్య తీసుకోవాలనుకుంటేఅందుకు అనుగుణంగా మంత్రివర్గంనిర్ణయం తీసుకుని సిఫార్సు చేయాల్సిఉంటుంది.

ఇదిలావుంటే, జార్ఖండ్‌ వ్యవహారంపైశుక్రవారం కూడా పార్లమెంటు ఉభయసభలు స్తంభించాయి. కార్యక్రమాలేవీచేపట్టకుండానే ఉభయ సభలు ఈ నెల 9వతేదీకి వాయిదా పడ్డాయి. జార్ఖండ్‌వ్వవహారంపై బిజెపి నాయకత్వంలోనిప్రతిపక్షాలు లోక్‌సభలోనూ,రాజ్యసభలోనూ గందరగోళంసృష్టించాయి. లోక్‌సభ సమావేశంప్రారంభం కాగానే ప్రతిపక్షనాయకుడు ఎల్‌.కె. అద్వానీ లేచి జార్ఖండ్‌గవర్నర్‌ను రికాల్‌ చేయాలనిడిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+