దిగివచ్చిన భజన్,సోనియాకు సలాం
న్యూఢిల్లీ: నిన్నఅలకపాన్పు ఎక్కిన హర్యానా మాజీముఖ్యమంత్రి భజన్‌లాల్ శనివారంకాంగ్రెస్ అధిష్టానవర్గానికి తలవంచారు. రాజకీయాలనుఅదుపు చేయడంలో కాంగ్రెస్ అధిష్టానవర్గం మరీ ముఖ్యంగా శ్రీమతి సోనియాగాంధి విజయం సాధించినట్టే కనిపిస్తున్నది.హర్యానా ముఖ్యమంత్రి పదవి దక్కడంలేదని శుక్రవారం అలిగిన భజన్‌లాల్‌శనివారం ఉడయానికి దిగివచ్చారు.తనకు ఎవరిమీదా ఆగ్రహం గాని, అక్కసుగాని లేదని, కాంగ్రెస్ పార్టీ వారంతా ఒకే కుటుంబంసభ్యులనీ భజన్‌శనివారం వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి పదవి కంటే పిసిసిఅధ్యక్ష పదవి పెద్దదని సోనియాగాంధీతనకు చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
