ఆంధ్ర- ఒరిస్సా జోనల్‌ కమిటీ సభ్యుడి అరెస్టు

రాజమండ్రి/హైదరాబాద్‌:సిపిఐ (మావోయిస్టు) ఆంధ్రా - ఒరిస్సాసరిహద్దు స్పెషల్‌ జోనల్‌ దళ కమిటీసభ్యుడు శేషగిరిరావు అలియాస్‌ వినయ్‌అలియాస్‌ గోపన్నను రాజమండ్రి పోలీసులుఅరెస్టు చేశారు. ఆయనను మూడువాహనాల ద్వారా గుర్తు తెలియనిప్రదేశానికి తరలిస్తున్నారనిమావోయిస్టు ప్రతినిధులు అంటున్నారు.అయితే ఆయనను హైదరాబాద్‌కుతరలిస్తున్నట్లు తెలుస్తోంది.శేషగిరిరావును వెంటనే కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టు ప్రతినిధివరవరరావు డిమాండ్‌చేశారు.

శేషగిరిరావుతోపాటు మరో ఇద్దరిని పోలీసులు ఈ నెల 2వతేదీన అరెస్టు చేసి రాజమండ్రిలోనిఆనంద్‌ రెసిడెన్సీ లాడ్జ్‌లో ఉంచారని, తానుఈ విషయాన్ని మీడియాకు చెప్పిన వెంటనేశేషగిరిరావును అక్కడి నుంచితరలించారని మావోయిస్టు ప్రతినిధివరవరరావు అన్నారు. శేషగిరిరావు అలియాస్‌ వినయ్‌ను మూడు టాటాసుమోల ద్వారా తరలించారని, అతడ్నిహైదరాబాద్‌ తీసుకు వస్తున్నారా,ఎన్‌కౌంటర్‌ చేయడానికి ఏజెన్సీ అడవుల్లోకితరలిస్తున్నారా అనేది తెలియడంలేదని ఆయన అన్నారు. గత నెల 26వతేదీ నుంచి జరుగతున్న బూటకపుఎన్‌కౌంటర్లను పరిశీలిస్తే రాష్ట్ర కమిటీనాయకుడు కూడా అయినందునశేషగిరిరావును ఎన్‌కౌంటర్‌ చేస్తారనేఅనుమానం కలుగుతోందని ఆయనఅన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+