వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లోరాష్ట్రపతి పాలనకు గవర్నర్‌సిఫార్సు

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా:బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించేఅవకాశం ఉంది. బీహార్‌లో రాష్ట్ర పాలనకుగవర్నర్‌ బూటాసింగ్‌ సిఫార్సు చేశారు.ఏ పార్టీకీ స్పష్టమైన బహుమతిలభించకపోవడంత రాజకీయసంక్షోభం తలెత్తింది. బీహార్‌లో లోక్‌జనశక్తి నాయకుడు రాం విలాస్‌పాశ్వాన్‌ను ఒప్పించి రాష్ట్రీయ జనతాదళ్‌ ( ఆర్జేడి) పాలనను ప్రతిష్టించాలనేకాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ దృష్ట్యా,జార్ఖండ్‌ తాజా అనుభవం దృష్ట్యాబీహార్‌లో రాష్ట్రపతి పాలనకు దారులుతెరుచుకున్నాయి.

ఇదిలావుంటే,ఢిల్లీలో బీహార్‌ విషయంపై చర్చించడానికిప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రి శివరాజ్‌ పాటిల్‌, కాంగ్రెస్‌నాయకుడు అహ్మద్‌ పటేల్‌సమావేశమయ్యారు. బీహార్‌లోరాష్ట్రపతి పాలన విధించడంఅత్యవసరమేమీ కాదని హోం మంత్రిశివరాజ్‌ పాటిల్‌ అన్నారు. ఈ నెలాఖరువరకు రాష్ట్రపతి పాలన విధించేయోచన లేదని ఆయనసూచనప్రాయంగా చెప్పారు.

బీహార్‌లోతాజాగా ఎన్నికలు నిర్వహించాలని ప్రగతిశీలఐక్య కూటమి (యుపిఎ)లో భాగస్వామి అయినసిపియం డిమాండ్‌ చేశారు. రాష్ట్రీయజనతాదళ్‌కు మద్దతు ఇవ్వాలని తాములోక్‌జనశక్తి నాయకుడు రాం విలాస్‌పాశ్వాన్‌ను తాము కోరబోమని సిపియంప్రధాన కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌సూర్జిత్‌ చెప్పారు.

తాముఆర్జేడికి గానీ, భారతీయ జనతా పార్టీకిగానీ మద్దతు ఇవ్వబోమని రాం విలాస్‌పాశ్వాన్‌ ఆదివారం గవర్నర్‌ బూటాసింగ్‌కు స్పష్టం చేశారు. పాశ్వాన్‌మద్దతు ఇస్తే తప్ప బీహార్‌లోప్రభుత్వం ఏర్పడలేని పరిస్థితినెలకొంది. తన వైఖరిలో ఏమైనా మార్పువచ్చిందా అని గవర్నర్‌ తననుఅడిగారని, తాను లేదని స్పష్టంచేశానని, ఆర్జేడి ప్రభుత్వం పోవడానికితగిన చర్యలు తీసుకోవాలని తానుగవర్నర్‌ను కోరారని పాశ్వాన్‌విలేకరులతో చెప్పారు.

శాంతిభద్రతలనుపరిరక్షించడానికి కొద్ది కాలం రాష్ట్రంలోకేంద్ర పాలన విధించాలని, తాము ఆర్జేడీని,బిజెపిని మినహాయించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నామని, అందుకు కొంతసమయం పడుతుందని, అయితేతప్పకుండా అది జరుగుతుందని ఆయనఅన్నారుజ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X