పరిటాలహత్య కేసులో తగరకుంట కొండారెడ్డిఅరెస్టు
హైదరాబాద్:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవీంద్ర హత్య కేసులో తగరకుంటకొండారెడ్డిని కేంద్ర దర్యాప్తుసంస్థ (సిబిఐ) అధికారులు అదుపులోకితీసుకున్నట్లు సమాచారం. పోలీసులఎఫ్‌ఐఆర్‌లో కొండారెడ్డి ప్రధాననిందితుడు. ఎఫ్‌ఐఆర్‌లో పేరున్నమద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డిఅలియాస్ సూరి భార్య గంగుల భానుమతిఇప్పటికే అనంతపురం కోర్టులోముందస్తు బెయిల్‌కు దరఖాస్తుచేసుకున్నారు. ఈ పిటిషన్ ఈ నెల 9వతేదీన విచారణకు వస్తుంది.
ఎఫ్‌ఐఆర్‌లోపేర్లున్న ముఖ్యమంత్రి కుమారుడువై.యస్. జగన్మోహన్ రెడ్డిని,రాష్ట్రమంత్రి జె.సి. దివాకర్ రెడ్డిని,రాయలసీమ ఐజి మీనాను, సూరిని సిబి ఐఅధికారులు ప్రశ్నించనున్నట్లుసమాచారం. కాగా, పరిటాల రవి భౌతికకాయానికి రేపు రీపోస్టుమార్టంజరుగుతుంది. రీపోస్టుమార్టంసందర్భంగా మీడియానుఅనుతించబోమని అనంతపురం పోలీసుసూపరింటిండెంట్ ప్రవీణ్‌కుమార్‌చెప్పారు. పరిటాల రవి స్వగ్రామంవెంకటాపురం వెళ్లే దారులన్నీ పోలీసులువిస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
