చంద్రబాబుభద్రత అధికారులదే: వైయస్‌

శ్రీకాకుళం/రాజమండ్రి: తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు భద్రత కల్పించే అంశంఅధికారులకు సంబంధించిందనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాపర్యటన ముగించుకొని హైదరాబాద్‌వచ్చే ముందు ఆయన ఆదివారంశ్రీకాకుళంలోనూ, రాజమండ్రిలోనూవిలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకుభద్రత తగ్గించలేదని ఆయనచెప్పారు. చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ కెటగిరీకింద ఎంత భద్రత ఇవ్వాలో అంతఇస్తున్నామని ఆయన అన్నారు.

నక్సల్స్‌పైనిషేధం విధించే విషయంపై ఇప్పటివరకు ఏ విధమైన నిర్ణయంతీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.నక్సలైట్ల చర్యలను నిశితంగాపరిశీలిస్తున్నామని, పరిస్థితులను పరిశీలించిఅవసరమైనప్పుడు తగిన నిర్ణయంతీసుకుంటామని ఆయన చెప్పారు.వేంపెంట సంఘటన చాలాదురదృష్టకరమైందని, అటువంటిసంఘటనలు పునరావృతం కాకుండాజాగ్రత్తలు తీసుకుంటామని ఆయనచెప్పారు. శాంతి భద్రతలనుపరిరక్షించాల్సిన బాధ్యతప్రభుత్వానిదని ఆయన అన్నారు.

తెలంగాణరాష్ట్ర సమితి నాయకుడు ఎ. నరేంద్రచేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందించడానికిఆయన నిరాకరించారు. అయితే సోనియాగాంధీ టిఆర్‌యస్‌కు అధ్యక్షురాలా,మాకు అధ్యక్షురాలా అని ఆయనవ్యంగ్యంగా అడిగారు. రాష్ట్ర కాంగ్రెస్‌నాయకులు ఎంత గింజుకున్నా తెలంగాణరాష్ట్ర ఏర్పాటును ఆపలేరని, సోనియా గాంధీఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రంసాధిస్తామని నరేంద్ర శనివారంమెదక్‌ జిల్లాలో అన్నారు.

గవర్నర్లనిర్ణయాన్ని తప్పు పట్టడం సరి కాదనిఆయన అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకుఅప్పటి గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌బర్నాలా తనను ఎలా పిలిచారో, జార్ఖండ్‌గవర్నర్‌ సిబ్తే రజీ శిబూ సోరేన్‌నుఅలాగే పిలిచారని ఆయన అన్నారు.గవర్నర్‌ నిర్ణయానికి సోనియాగాంధీఎలా బాధ్యురాలవుతుందని ఆయనఅడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+