ఉస్మానియా ఆస్పత్రి తీరుపై సియం అసంతృప్తి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్వహణ తీరు పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంలోగా పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన ఆస్పత్రి సూపరింటిండెంట్‌ను ఆదేశించారు. ఆయన సోమవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఉస్మానియాలోని వార్దులు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని ఆయన అంటూ వారంలోగా అన్ని వార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆస్పత్రి సూరింటిండెంట్‌కు సూచించారు. మెడికల్ స్టోర్‌లను కూడా ఆయన సందర్శించారు. ఎక్కువ ధరలకు మందులు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోగుల నుంచి ఆయన పిటిషన్లు స్వీకరించారు. యూజర్ ఛార్జీలపై కూడా ఆయన రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications