AP EAPCET Result 2026: ఎంసెట్ ఫలితాల ముహుర్తం ఫిక్స్-ఇలా చెక్ చేసుకోండి..!

ఈ ఏడాది ఏపీలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (EAMCET) ఫలితాలు (AP EAPCET Result 2026) విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈఏపీసెట్ ఫలితాలను వాస్తవానికి జూన్ 1నే విడుదల చేయాల్సి ఉండగా.. ఇంటర్ అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ ఫలితాల కారణంగా ఆలస్యం చేశారు. ఇప్పటికే ఎంసెట్ జవాబుపత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. దీంతో రేపు ఈ ఫలితాల విడుదలకు అధికారులు రంగం సిద్దం చేశారు.

ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ ఈసారి ఎంసెట్ పరీక్షను నిర్వహించింది. ఇందులో 3.55 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరై పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురూచూస్తున్నారు. ఫలితాలను రేపు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయగానే అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in/EAPCET లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ అవుట్ తీసుకుని కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్లాల్సి ఉంటుంది.

AP EAPCET Result 2026

ఇంజనీరింగ్ విభాగంలో అభ్యర్థులందరికీ ఇస్తున్న 25% ఇంటర్ పరీక్షల వెయిటేజీని పారదర్శకంగా లెక్కించేందుకే ఎంసెట్ ఫలితాలను అధికారులు ఆలస్యం చేశారని తెలుస్తోంది. రేపు ఉదయం ముందుగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ప్రకటించబోతున్నారు. అనంతరం ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఎంసెట్ రాసిన అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్, అడ్మిట్ కార్డుల వివరాల ఆధారంగా అడ్మిట్ కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+