"మోడీ కామ్, కూల్, కిల్లర్"- ట్రంప్ పొగిడారా ? తిట్టారా ?
జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు వెళ్లిన ప్రధాని మోడీ ఇవాళ అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతున్నారు. అయితే ఈ ద్వైపాక్షిక సమావేశంలో కూర్చోవడానికి ముందే మోడీ (PM modi)ని ఉద్దేశించి ట్రంప్ (trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ ఉద్దేశపూర్వకంగా చేశారా లేక మోడీని ప్రసన్నం చేసుకోవడానికి చేశారో తెలియదు కానీ ఇవి మాత్రం చర్చనీయాంశమవుతున్నాయి.
చాలా కాలం తర్వాత ప్రధాని మోడీతో భేటీ అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీని ప్రశాంత స్వభావం గలవారని, నిబ్బరంగా ఉండేవారని, పూర్తిగా అదరగొట్టే వ్యక్తి అని ఆకాశానికెత్తేశారు. జీ7 నాయకుల విందులో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు, భారత్-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత సత్సంబంధాలు చెక్కుచెదరలేదని స్పష్టం చేస్తున్నాయి.

ఇవాళ మధ్యాహ్నం జీ7 సదస్సుకు హాజరైన సందర్భంగా ట్రంప్-మోడీ కలిసినా ఎప్పటిలాగే కౌగిలింతలు లేకుండా కేవలం షేక్ హ్యాండ్ తో సరిపెట్టడంతో ఏదో గ్యాప్ ఉందన్న చర్చ జరిగింది. కానీ ట్రంప్..ఆ తర్వాత మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. ప్రధాని మోదీ ప్రశాంతమైన, నిబ్బరమైన ప్రవర్తనకు ట్రంప్ ఆశ్చర్యపోయారు. ప్రశాంతంగా, నిబ్బరంగా, పూర్తిగా అదరగొట్టే వ్యక్తి అయిన ప్రధాని మోదీలా నేను కాదు, ఆయన్ని చూడండి అంటూ ప్రపంచ నాయకుల సమావేశంలో ట్రంప్ సూచించారు.

వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు 2024లో ట్రంప్ ప్రధాని మోదని ఉద్దేశించి ఈ కిల్లర్ పదాన్ని మొదటిసారి ఉపయోగించారు.మోదీ, ఆయన నా స్నేహితుడు, చాలా మంచి మనిషి, బయటకు చూస్తే, ఆయన మీ తండ్రిలా కనిపిస్తారు. ఆయన చాలా మంచివారు, పూర్తిస్థాయిలో గట్టివారు అంటూ ట్రంప్ గతంలో ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. గతేడాది జరిగిన ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో నూ ట్రంప్.. మరోసారి ప్రధాని మోదీ కఠినమైన నాయకత్వ శైలిని ప్రశంసించారు.













Click it and Unblock the Notifications