రాజమౌళితో పని అంటే ఎలా ఉంటుందో మహేష్‌బాబుకు చెప్పి భయపెట్టిన తారక్
టాలీవుడ్‌లో గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. స్క్రీన్‌పైనే కాదు, బయట కూడా ఎంతో హుందాగా, సైలెంట్‌గా కనిపించే మహేష్ బాబులో ఒక అద్భుతమైన టైమింగ్ ఉన్న కమెడియన్, రైటర్ దాగున్నారనే విషయం చాలామందికి తెలియదు. ఆయన వేసే రివర్స్ పంచ్‌లు, సెటైర్లకు టాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం ఒక్కోసారి క్లీన్ బౌల్డ్ అయిపోతుంటారు. అయితే, అలాంటి సూపర్ స్టార్‌ను ఒకానొక సందర్భంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. దానికి తోడు 'దర్శకధీరుడు రాజమౌళి' పేరు చెప్పి మహేష్ బాబును గట్టిగానే భయపెట్టారు. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే..
మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో
గతంలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' టాక్ షో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ ఎపిసోడ్‌లో తారక్, మహేష్ బాబుల మధ్య నడిచిన చిట్‌చాట్, పంచ్‌ల ప్రవాహం ప్రేక్షకులను బుల్లితెరకు అతుక్కుపోయేలా చేసింది. ముఖ్యంగా మహేష్ బాబు తరచూ వెళ్లే ఫారెన్ టూర్ల గురించి తారక్ సరదాగా ఏడిపిస్తూ ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రస్తావన రాగా.. "మనం కూడా ఓ మ్యాచ్ ఆడదాం అన్నా" అంటూ మహేష్‌కు తారక్ ఆఫర్ ఇచ్చారు. దానికి మహేష్ బాబు స్పందిస్తూ.. "ఆడదాం కానీ బాబోయ్.. కార్క్ బాల్ వద్దు.. టెన్నిస్ బాల్ లేదా రబ్బర్ బాల్‌తో ఆడుదాం" అని నవ్వుతూ చెప్పారు.

జక్కన్న అన్ని ఆటలు ఆడిస్తారులే
మహేష్ బాబు అలా అనడమే ఆలస్యం.. తారక్ తనదైన శైలిలో సిక్సర్ కొట్టారు. "అన్నా! జక్కన్నతో సినిమా చేస్తున్నారు కదా.. ఇక నుంచి మీకు అన్ని ఆటలూ ఆయనే ఆడిస్తారులే! చిన్నగా అలవాటైపోతుంది" అంటూ రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టే ప్రయత్నం చేశారు తారక్. రాజమౌళితో 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ', 'ఆర్ఆర్ఆర్' వంటి నాలుగు భారీ సినిమాలు చేసిన అనుభవంతో.. "జక్కన్నతో సినిమా అంటే మామూలుగా ఉండదు.. ఇక నుంచి మీకు గట్టిగానే ఉంటది" అంటూ సరదాగా హింట్ ఇచ్చారు. అయితే, వెంటనే సర్దుకుంటూ.. మహేష్ బాబు పడే హార్డ్ వర్క్ రాజమౌళి సినిమాకు వంద శాతం ఉపయోగపడుతుందని, వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక అద్భుతమైన సినిమా రాబోతోందని తారక్ కొనియాడారు.
ఎన్ని టేకులైనా తీసుకుంటారు
జక్కన్నతో సినిమా అంటే పర్‌ఫెక్ట్ షాట్ కోసం ఎన్ని టేకులైనా తీసుకుంటారని, నటీనటుల రక్తం పిండేస్తారని ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు గతంలో చాలాసార్లు సరదాగా చెప్పారు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న అడ్వెంచర్ యాక్షన్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో, పాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నాన్‌స్టాప్ షెడ్యూల్స్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబును జక్కన్న ముందెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ సూపర్ హీరో తరహా పాత్రలో చూపించబోతున్నట్లు టాక్.












Click it and Unblock the Notifications