సరైనవ్యక్తినిబీహార్ సలహాదారుగా నియమిస్తాం: పాటిల్
పాట్నా: బీహార్‌లో కేంద్రంసోమవారం రాష్ట్రపతి పాలన విధించినసందర్భంగా గవర్నర్ బూటా సింగ్‌కుఅన్ని విధాలా సహకరించే సమర్థవంతమైనవ్యక్తిని సలహాదారుడిగా కేంద్రం నియమిస్తుందనిహోంమంత్రి శివరాజ్ పాటిల్ అన్నారు.సలహాదారు పదవికి ఎవరిని ఎంపిక చేశారనేవిషయాన్ని చెప్పకుండా దాటవేశారు. బీహార్‌లోరాష్ట్రపతి పాలన విధించినందుకు ఎల్.జె.పి అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ హోంమంత్రినిఆయన నివాసంలో కలుసుకుని అభినందనలుతెలిపారు. బీహార్ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా,నిష్పాక్షికంగా పనిచేసే వ్యక్తికిసలహాదారు పదవిని అప్పగించాలనికోరారు. ఆర్జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌జారీ చేసే ఆదేశాలను గాని పాశ్వాన్‌ఆదేశాలనుగాని ఖాతరు చేయకుండా కేవలం బీహార్‌అభివృద్ధి కోసమే పనిచేసే వ్యక్తిని నియమించాలనివిజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
