శ్రీశైలంలోప్రతిధ్వనించిన శివనామం
హైదరాబాద్:ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనశైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రిఉత్సవాలు వైభవంగా జరిగాయి.భక్తులు భ్రమరాంబ, మల్లికార్జునసన్నిధిలో ఇరుముడి సమర్పించి బ్రహ్మగిరి,విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకుపాదాభివందనం చేస్తూ పవిత్ర కృష్ణానది పాతాళగంగలో పుణ్యస్నానాలుచేశారు. ఇసుకవేస్తే రాలనంతగాభక్తులతో శ్రీశైలక్షేత్రం పరవశించింది.దేవాలయప్రాంగణంలో క్యూ కాంప్లెక్స్‌లుభక్తులతో నిండిపోయాయి. పాతాళగంగ,లింగాలగట్టు స్నానఘట్టాల్లో లక్షల మందిభక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గతంలోఎన్నడూలేనంతగా భక్తులరద్దీపెరిగింది. ఈనెల 5వతేదీ నుంచి 7వతేదీవరకు దాదాపు నాలుగు లక్షల మంది భ్రమరాంబామల్లికార్జున స్వామి అమ్మవార్లనుదర్శించుకోగా మంగళవారం ఒక్క రోజేదాదాపు 3లక్షల మంది భక్తులు స్వామి అమ్మవార్లనుదర్శించుకున్నారు. పాతాళగంగకు ఉన్న500 మెట్లు భక్తులతో నిండిపోయాయి. శివరాత్రిఉత్సవాల్లో సాధారణ భక్తులకంటేశివమాలలు ధరించిన భక్తులే అత్యధికంగాకనిపించారు.












Click it and Unblock the Notifications
