క్రికెట్‌: పాక్‌కు భారత్‌ ధీటైన జవాబు

మొహాలీ:వర్షం కారణంగా భారత్‌, పాక్‌లమధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌బుధవారం ఆలస్యంగా ప్రారంభమైంది.భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌,గౌతమ్‌ గంభీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభాన్ని అందించారు.. వీరేంద్ర సెహ్వాగ్‌ చెలరేగి ఆడాడు. ఒక సిక్సర్‌ కూడా కొట్టాడు.గంభీర్‌ సెహ్వాగ్‌కు మంచి సహకారంఅందించాడు. గౌతమ్‌ గంభీర్‌ 41 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కనేరియా బౌలింగ్‌లో అవుటయ్యాడు. తొలి వికెట్‌ భాగస్వామ్యానికి సెహ్వాగ్‌, గంభీర్‌ 113 పరుగులు జోడించారు. బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో ఒకవికెట్‌ నష్టపోయి 184 పరుగులు చేసింది.

అనంతరంబ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌ ద్రావిడ్‌ఆచితూచి ఆడుతున్నాడు. రెండు సార్లుఅవుటయ్యే ప్రమాదం నుంచితప్పించుకున్న వీరేంద్ర సెహ్వాగ్‌తన టెస్టు కెరీర్‌లో తొమ్మిదో అర్థసెంచరీ పూర్తి చేశాడు. వెలుతురు సరిగాలేని కారణంగా నిర్ణీత వ్యవధి కన్నాముందే బుధవారం ఆట ముగిసింది. ఆటముగిసే సమయానికి సెహ్వాగ్‌ 95పరుగులతోనూ, ద్రావిడ్‌ 39 పరుగులతోనూక్రీజ్‌లో ఉన్నారు. పాకిస్థాన్‌ తొలిఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసింది.పాకిస్థాన్‌ బౌలింగ్‌ భారతబ్యాట్స్‌మెన్‌పై అంతగా ప్రభావంవేయకపోవడంతో పాటు పాకిస్థాన్‌ఫీల్డింగ్‌ కూడా బాగా లేదు. వచ్చినఅవకాశాలను పాక్‌ జారవిడుచుకుంది.

వర్షపు తుంపరలు ఎడతెగకుండాపడడంతో భార త్‌-పాక్‌మధ్య ఇక్కడ జరగవలసిన తొలిటెస్టు రెండో రోజు ఆట నిర్ణీత సమయానికి ప్రారంభం కాలేదు.క్రికెట్‌ మ్యాచ్‌లకు ఒక్కోసారి వానదేవుడుఅడ్డుపడడం మామూలే. నేటి వానవల్ల పిచ్‌ ఎంత బాగా తడిసిందన్నదిభారతీయ క్రికెట్‌ మేధావులుపరిశీలిస్తున్న అంశం. తొలి టెస్టు తొలి రోజేఆలౌటై కష్టాల్లో కూరుకుపోయిన పాక్‌జట్టుకు వర్షం కొంత మేలు చేసిందన్నఅభిప్రాయం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+