రీపోస్టుమార్టం అవసరం లేదు: జానారెడ్డి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా మనాల ఎన్‌కౌంటర్‌పై రీపోస్టుమార్టం అవసరం లేదని హోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టం చేశారు. పోస్టుమార్టం అంతా తన ఆదేశాల మేరకే జరిగిందని, తనను పోలీసు అధికారులు తప్పుదోవ పట్టించలేదని ఆయన అన్నారు. మానాల ఎన్‌కౌంటర్‌పై విప్లవపక్ష ప్రతినిధులు, మానవ హక్కుల ప్రతినిధులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.
విప్లవ పక్ష ప్రతినిధులు తమ ప్రకటనలను వెనక్కి తీసుకుంటే రీపోస్టుమార్టం గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా మానాల అటవీ ప్రాంతంలో ఈ నెల ఏడున జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు మరణించారు. అయితే నక్సలైట్లకు విషప్రయోగం చేసి పోలీసులు వారిని పట్టుకుని చంపారనే ఆరోపణలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications
