11న సోరేన్‌ బలపరీక్ష: సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ఈ నెల 11వ తేదీన శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడాలని సుప్రీంకోర్టు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి శిబూ సోరేన్‌ను ఆదేశించింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంగ్లో ఇండియన్‌ ఎమ్యెల్యే నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

బలపరీక్ష వీడియో కెమెరాల నీడలో జరగాలని కూడా సూచించింది. విశ్వాస పరీక్ష విషయంలో ప్రోటెం స్పీకర్‌కు కూడా సుప్రీంకోర్టు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. విశ్వాస పరీక్ష ఫలితాన్ని తమకు విశ్వసనీయంగా తెలియజేయాలని ప్రోటెం స్పీకర్‌ను ఆదేశించింది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ మొత్తం వీడియో తీయించి తమకు పంపాలని కూడా ఆదేశించింది. శిబూ సోరేన్‌ ప్రభుత్వం ప్రతిపాదించే విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగే సమయంలో గొడవలకు దిగతే సహించబోమని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+