మానాల ఘటనపై సిబిఐ దర్యాప్తు: టిఆర్‌యస్ డిమాండ్
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా మానాల, కర్నూలు జిల్లా వేంపెంట ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దర్యాప్తునకు ఆదేశించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టి ఆర్‌యస్ సభ్యుడు ఎస్. రామలింగారెడ్డి బుధవారం శాసనసభ జీరో అవర్‌లో ప్రభుత్వాన్ని కోరారు. మానాలలో పది మంది నక్సలైట్లు హతం కాగా, వేంపెంటలో 8 మందిని నక్సలైట్లు ఊచకోత కోశారు.
శాంతి పునరుద్ధరణ పేరుతో గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక చర్యలను అనుసరించడం సరి కాదని రామలింగా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, ఈ ప్రాంతాన్ని రక్తంసిక్తం చేయవద్దని ఆయన అన్నారు. రాజ్యాంగానికి అతీతంగా పని చేస్తున్నవారిపై శాంతిభద్రతల పేరు మీద విషప్రయోగం చేసి చంపడం సరి కాదని, ఇటువంటి చర్యలు బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో కూడా జరగలేదని, ఈ సంఘటనలు ఫాక్షనిస్టు రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయని ఆయన అన్నారు. హతమైన నక్సలైటు కాళ్లు నరికివేసి ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
