వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మానవహక్కులసంఘం ఇప్పుడేమంటుంది?- వైఎస్
గుంటూరు:గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్ పై శుక్రవారంరాత్రి నక్సల్స్ దాడి చేసి నలుగురు పోలీసులు సహాఏడు మందిని దారుణంగాహతమార్చిన సంఘటనఅసాధారణమని ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డిఅన్నారు. పోలీసు ఎన్‌కౌంటర్లను ఖండించటానికిముందు తాము పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలగురించి మానవహక్కుల పరిరక్షణకార్యకర్తలు బేరీజు వేసుకోవాలనిఆయన సూచించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌పోలీసువ్యవస్థను నైతికంగా దెబ్బతీయలేదనిఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కోవటానికిపోలీసులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నక్సల్స్‌చేతుల్లో మారణాయుధాలు ఉన్నంతకాలంహింస తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం ముఖ్యమంత్రి, రాష్ట్రహోంమంత్రి చిలకలూరిపేట సందర్శించిమృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!