నక్సల్ గోపన్నకు మూడు రోజుల పోలీసు రిమాండ్
రాజమండ్రి: సిపిఐ (మావోయిస్టు) ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు దళం నక్సలైట్ శేషగిరిరావు అలియాస్ గోపన్నను మూడు రోజుల పాటు పోలీసు రిమాండ్‌కు అప్పగిస్తూ రాజమండ్రి మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. గోపన్నను ఇటీవల రాజమండ్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మెజిస్ట్రేట్ పలు నిబంధనలు విధిస్తూ గోపన్నను పోలీసు రిమాండ్‌కు అప్పగించారు. ఆయనను రేపు 12 గంటల నుంచి మూడు రోజుల పాటు పోలీసు రిమాండ్‌లో ఉంచి విచారిస్తారు. ప్రతి రోజు మూడు సార్లు న్యాయవాదులు గోపన్నను కలుసుకోవడానికి అవసకాశం కల్పించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications
