మానాల మృతులకు రీపోస్టుమార్టానికి హైకోర్టు నో
హైదరాబాద్: మానాల ఎన్‌కౌంటర్ మృతుల శవాలకు రీపోస్టుమార్టం జరిపించాలని ఆదేశించడానికి హైకోర్టు నిరాకరించింది. మృతుల కుటుంబాల నుంచి అభ్యంతరాలు రాకపోవడంతో రీపోస్టుమార్టం జరపాలని మావోయిస్టు ప్రతినిధి వరవరరావు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది.
నిజామాబాద్ జిల్లా మానాల అటవీ ప్రాంతంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టు నక్సలైట్లు మరణించారు. వారికి విషప్రయోగం చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మానాల ఎన్‌కౌంటర్‌లో మరణించినవారి మృతదేహాలకు రీపోస్టుమార్టం జరిపించాలని కోరుతూ మావోయిస్టు ప్రతినిధి వరవరరావు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. వీడియో టేపులను పరిశీలించిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. సోమవారం హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది.












Click it and Unblock the Notifications
