వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు నెలల్లోగా మున్సిపల్‌ ఎన్నికలు

By Staff
|
Google Oneindia TeluguNews

హౖౖెదరాబాద్‌: రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికలను ఆరునెలల్లోపు నిర్వహించనున్నట్టు మునిసిపల్‌ శాఖ మంత్రి కోనేరు రంగారావు సోమవారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. అంతకు ముందు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడల్లా మునిసిపల్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయని, తాము అధికారంలోకి రాగానే ఆ ఎన్నికలు జరిపించామని అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఎప్పుడూ సకాలంలో జరగ లేదని, తాము రెండు సార్లు ఎంసిహెచ్‌ ఎన్నికలు జరిపించామని ఆయన పేర్కొన్నారు. మునిసిపల్‌ ఎన్నికలు సకాలంలో జరపకపోవడం వల్ల నిధులు వినియోగంలోకి రావడం లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే టి. దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. సాంకేతిక కారణాల వల్ల మునిసిపల్‌ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని, తాజా జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవలసి ఉందని, ఆరునెలల్లోగా మునిసిపాటిలకు ఎన్నికలు జరిపిస్తామని మునిసిపల్‌ శాఖ మంత్రి కోనేరు రంగారావు సమాధానమిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X