కరెంట్ బాకీల వసూళ్లపై ప్రతిపక్షాల వాకౌట్
హౖౖెదరాబాద్: యస్‌సి, యస్‌టి విద్యుత్ బకాయిలను వసూలు చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు సోమవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. తమ ప్రభుత్వ హయాంలో యస్‌సి, యస్‌టిలకు చెందిన 200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను రద్దు చేశామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రద్దును పట్టించుకోకుండా బలవంతంగా వసూలు చేస్తోందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.
విద్యుత్ బకాయిలను 24 వాయిదాల్లో చెల్లించాలని ఆదేశించామని, అందుకు విరుద్ధంగా అధికారులు వసూలుకు దిగి వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి కె. రోశయ్య చెప్పారు. పేదలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఈ విషయంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. తమ డిమాండ్‌ను పట్టించుకోనందుకు నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
విద్యుత్ బిల్లుల్లో పారదర్శకత కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేస్తామని మంత్రి కె. రోశయ్య చెప్పారు. ప్రతి నెలలో విద్యుత్ బిల్లులను దశలవారీగా వసూలు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 31 లక్షల 50 వేల ఎలక్ట్రానిక్ విద్యుత్ బిల్లింగ్ యంత్రాలున్నాయని, వీటిలో 0.5 శాతం యంత్రాల్లో లోపాలున్నాయని, ఈ లోపాలను సరిదిద్దుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
