భారత్‌ బౌలర్ల వైఫల్యం: పాక్‌ జోడీ సెంచరీలు

కోల్‌కత్తా: భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ భారీ స్కోర్‌కు పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ధీటైన జవాబు ఇస్తున్నారు. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ యోహానా, యూనిస్‌ఖాన్‌లు భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ జోడి ముందు భారత బౌలర్లు చేతులెత్తేశారు. గురువారం ఆట ముగిసే సమయానికి ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ కూడా సెంచరీ చేసి అజేయంగా నిలిచారు. యూనిస్‌ఖాన్‌ 108 పరుగులతోనూ, యూసుఫ్‌ యోహానా 101 పరుగులతోనూ క్రీజ్‌లో ఉన్నారు. గురువారం ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.

బుధవారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసిన భారత్‌ గురువారం మిగతా నాలుగు వికెట్లను కోల్పోయి 407 పరుగులు చేసింది. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద దినేష్‌ కార్తిక్‌ అవుట్‌ కాగా, హర్బజన్‌ సింగ్‌ 27 పరుగులు చేసి అవుటయ్యాడు. కుంబ్లే 21 పరుగులతో నాటవుట్‌గా మిగిలాడు. పఠాన్‌ 8, బాలాజీ 3 పరుగులు చేశారు. గురువారంనాడు కనేరియా, రజాక్‌, ఆఫ్రిదీలకు ఒక్కటేసి వికెట్లు లభించాయి.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 70 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయింది. ఆఫ్రిది 29 పరుగులు, ఉమర్‌ 18 పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత యూనిస్‌, యోహానాల జోడీ భారత బౌలర్లకు ఏ సమయంలోనూ లొంగలేదు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కుంటూ స్కోర్‌ బోర్డును పరిగెత్తించారు. ఈ జోడీ తమ 203 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి పటిష్టమైన పునాదులు వేసింది. ఇర్ఫాన్‌ పఠాన్‌, బాలాజీ చెరో వికెట్‌ తీసుకున్నారు.

స్కోర్‌ బోర్డు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+