మేనేజ్‌మెంట్ కోటా పెంపు విద్యార్థులన నిరసన
హైదరాబాద్: మైనారిటీ బి. ఇడి. కాలేజీల్లో యాజమాన్యం కోటా పెంపునకు సోమవారం పెద్ద యెత్తున నిరసన వెల్లువెత్తింది. వరంగల్‌లో బి. ఇడి. కౌన్సెలింగ్ కేంద్రం వద్ద బారతీయ విద్యార్థి పరిషత్ ( ఎబివిపి) విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
హైదరాబాద్‌లోని సాంకేతిక భవన్ వద్ద భారత విద్యార్థి సమాఖ్య ( ఎస్‌యఫ్ ఐ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎబివిపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయ పరిధిలోని బి. ఇడి. కళాశాలల్లో ఫీజు పెంపును కూడా విద్యార్థులు నిరసిస్తున్నారు.












Click it and Unblock the Notifications
