వైయస్‌తో భానుమతి పర్యటనపై రభస
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పర్యటనలో శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితురాలైన గంగుల భానుమతి పాల్గొనడంపై ప్రత్యేక చర్చకు స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి అనుమతి ఇచ్చారు. అనంతపురం నగర బాటలో భానుమతి రాజశేఖర్ రెడ్డి వాహనంలో ఆయన పక్కన భానుమతి పర్యటించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ సోమవారం శాసనసభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించారు.
వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సురేష్ రెడ్డి తిరస్కరించారు. దీంతో తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని తెలుగుదేశం సభ్యులు పట్టించుకోలేదు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ సమయంంలో ఆయన తెలుగుదేశం నాయకులతో చర్చించారు. సభ తిరిగి సమావేశం కాగానే భానుమతి ముఖ్యమంత్రితో కలిసి చేసిన పర్యటన అంశంపై ప్రత్యేక చర్చకు అనుమతించనున్నట్లు ప్రకటించారు. దీంతో సభ సద్దుమణిగి ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది.












Click it and Unblock the Notifications
