టిటిడి ఆస్తుల దురాక్రమణ నిజమే: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆస్తుల దురాక్రమణ పెద్ద యెత్తున జరిగిన మాట వాస్తవమేనని దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు సోమవారం శాసనసభలో అంగీకరించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అధికంగా టిటిడి ఆస్తుల దురాక్రమణ అధికంగా జరిగిందని ఆయన అన్నారు. అన్యాక్రాంతమైన టిటిడి భూముల స్వాధీనానికి సంబంధించిన కేసులను ఉపసంహరించుకోవాలని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలిచ్చారని, అలా చంద్రబాబు ఎందుకు ఆదేశాలిచ్చారో తెలియదని ఆయన అన్నారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని ఆయన చెప్పారు. అన్యాక్రాంతమైన భూములకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకోవాలని తాను ఆదేశాలివ్వలేదని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
