గోవర్ధన్ రెడ్డిని సిబిఐకి అప్పగించడంపై రేపు నిర్ణయం
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో విప్లవ దేశభక్త పులుల ( ఆర్పీటి) నాయకుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగించే విషయంపై కోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. గోవర్ధన్ రెడ్డిని తమకు అప్పగించాలనే సిబిఐ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి.
పరిటాల హత్య కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలను సిబిఐ సోమవారం కోర్టుకు అప్పగించింది. ఇందులో పరిటాల రవి వాడిన సుమోతో పాటు నిందితులు వాడిన రెండు స్కూటర్లు, క్రూయిజ్ ఉన్నాయి. ఇదే కేసులో ఆనంద్‌కుమార్ రెడ్డి, జి.వి. రెడ్డిల రిమాండ్‌ను మరో 14 రోజులు పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications
