వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: వైయస్
అనంతపురం: అనంతపురం జిల్లాతో పాటు వెనకబడిన జిల్లాల రూపురేఖలను సమూలంగా మార్చేస్తామని, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఉచిత విద్యుత్ సరఫరాపై తెలుగుదేశం పార్టీ అవనసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధుల లభ్యతతో పాటు నీటి లభ్యతను కూడా గ్యారంటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టాకు, నాగార్జునసాగర్ ఆయకట్టుకు మళ్లించి, కృష్ణా జలాలను దక్షిణ తెలంగాణకు, రాయలసీమకు అందించాలనేది తమ ఉద్దేశ్యమని, తద్వారా అనంతపురం జిల్లాకు తుంగభద్ర జలాలను అందించవచ్చునని ఆయన అన్నారు. తాము సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక సమగ్ర దృక్పథంతో అడుగు వేస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
