ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు
హైదరాబాద్: రాష్ట్రంలో హోలీ పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలో హోలీ పండుగ సందర్భంగా జనం మనోహరంగా పండుగ ఉత్సవాలను జరుపుకున్నారు. హోలీ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సుశీల్ కుమామార్ షిండే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సునామీ వల్ల రాష్ట్రానికి నష్టం జరిగినందువల్ల తాను హోలీ వేడుకల్లో పాల్గొనదలచుకోలేదని, రాజ్‌భవన్‌కు వచ్చి తనను కలుసుకోడానికి వచ్చిన వారితో మాత్రమే హోలీ వేడుకల్లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ నాయకత్వంలో వచ్చిన కార్యకర్తలతో షిండే హోలీ వేడుకలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications
