మావోయిస్టు ప్రతినిధులను ఎందుకు సహించాలి: మంత్రి ఎమ్మెస్
హైదరాబాద్: నక్సలైట్ల హింసాకాండను సమర్ధిస్తున్న మావోయిస్టు ప్రతినిధులను ఎందుకు అరెస్టు చేయకూడదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావు వరవరావు ప్రశ్నించారు. శాంతిచర్చలపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చిత్తశుద్ధి ఉందని, అయితే మావోయిస్టులు ఆయుధాలు వదిలి చర్చలకు రావాలని ఆయన అన్నారు. నక్సలైట్ల విధానాలను తాను సమర్ధిస్తున్నానని పదేపదే చెబుతున్న ఎం సత్యనారాయణరావు శనివారం ఈ విధమైన ప్రకటన చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి రెండు మూడు రోజుల క్రితం డిజిపి తదితర ఉన్నతాధికారులను పిలిపించి మావోయిస్టులపై కాల్పుల విషయంలో సంయమనం పాటించవలసిందిగా కోరారని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications
