స్లాబ్‌సిస్టం తొలగింపుపై సినిమా ప్రముఖుల భిన్నస్వరాలు
హైదరాబాద్: సినిమా పరిశ్రమకు సంబంధించి స్లాబ్ సిస్టంను తొలగించడంపై తెలుగు సినిమా ప్రముఖుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్లాబ్ సిస్టం తొలగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఇది తొందరపాటు చర్య అని, ముఖ్యంగా పెద్ద సినిమాల నిర్మాతలు నష్టపోతారని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. అయితే వీడియో పైరసీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ఆహ్వానించారు. స్లాబ్ సిస్టంను తొలగించడం చలనచిత్ర పరిశ్రమ సాధించిన విజయమని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జి.ఆదిశేషగిరిరావు అభివర్ణించారు. స్లాబ్ సిస్టం తొలగించడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయని మరో నిర్మాత అంబికాకృష్ణ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
