మా సభ్యులకే సినీ ఛాన్స్: మోహన్‌బాబు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) సభ్యులకే నిర్మాతలు సినిమా అవకాశాలు ఇవ్వాలని సంఘం అధ్యక్షుడు మోహన్‌బాబు సూచించారు. ఈ మేరకు తమ సంఘం ఒక తీర్మానం చేసిందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. మా సభ్యులకు మాత్రమే సినిమాల్లో నటించేందుకు నిర్మాతలు అవకాశం ఇస్తే తెలుగు సినిమా రంగంలో ఆరోగ్యకరమైన పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు.
నిర్మాతలు నిర్ణీత సమయానికే షూటింగ్ ప్రారంభించాలని, దీని వల్ల ఆర్టిస్టుల సమయం వృధా కాదని ఆయన అన్నారు. నిర్ణీత సమయానికి షూటింగ్ జరగకపోతే ఆ సమయంలో చిత్రీకరించాల్సిన దృశ్యాల చిత్రీకరణకు మళ్లీ సమయం తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఆ దృశ్యాల చిత్రీకరణకు ఆర్టిస్టులు రెండో రోజు రావలసిన అవసరం లేదని ఆయన అన్నారు. కొంత మంది నిర్మాతలు నిర్ణీత సమయానికి రాకుండా జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
