కాంగ్రెస్, టిఆర్‌యస్ విడిపోతేనే తెలంగాణ: బిజెపి
గుంటూరు: కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) విడిపోతే తప్ప తెలంగాణ రాదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. కాంగ్రెస్, టి ఆర్‌యస్‌లు అధికార దాహంతో వ్యవహరిస్తున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముందు క్యాబినెట్ విభజన జరగాలని, క్యాబినెట్ విభజన జరగకపోతే రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.
టి ఆర్‌యస్ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. మంత్రుల్లో జవాబుదారీతనం లోపించిందని ఆయన విమర్శించారు. శాసనసభకు జవాబుదారీ తనం వహించని క్యాబినెట్ కొనసాగడానికి వీలు లేదని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉన్నదని ఆయన చెప్పారు. నక్సల్స్ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవగాహన లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
