నా కుమారుడి జోక్యం ఎక్కడా లేదు: జానా

హైదరాబాద్‌: పోలీసు అధికారుల నియామకాల్లో, బదిలీల్లో తమ కుమారుడి జోక్యం లేదని హోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టం చేశారు. తన కుమారుడికి ఏ వ్యాపారాలూ లేవని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పోలీసు అధికారుల నియామకాలు, బదిలీల్లో తన కుటుంబసభ్యులు జోక్యం చేసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన సవాల్‌ చేశారు.

తన కుటుంబ సభ్యులు తమ పరిధిని దాటి వ్యవహరించరని, ఈ విషయాన్ని తన వద్ద అటెండర్లుగా, పి ఎలుగా, పియస్‌లుగా పని చేసినవారిని అడిగి తెలుసుకోవచ్చునని ఆయన అన్నారు. వారి నుంచి చిన్న విషయాన్ని రాబట్టినా తాను ఇక్కడ ఉండని ఆయన అన్నారు. తన ఇంటి నుంచి ఏ విధమైనా సిఫార్సులు జరగలేదు, జరగవని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+