బాబు సూచనతో నాకు మేలు: సింధూర
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన సలహాలు, సూచనలు తనకెంతో ఉపయోగపడతాయని మిస్ ఇండియా వరల్డ్ గద్దె సింధూర అన్నారు. ఆమె శుక్రవారంనాడు చంద్రబాబును కలిశారు. చంద్రబాబు గురించి తాను ఇంత ముందు విన్నానని, ఇప్పుడు స్వయంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని, చంద్రబాబు తనకు ఎంతో మంచి సూచన చేశారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. మిస్ వరల్డ్ కిరీటం తెచ్చి దేశానికి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆయన తనకు చెప్పారని ఆమె అన్నారు.
సింధూరకు మంచి జరగాలని తాను కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. బీజింగ్‌లో ఆమె మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. సింధూర మిస్ వరల్డ్ తేగల ప్రతిభ ఉందని ఆయన అన్నారు. సింధూరకు చంద్రబాబు మెమెంటో అందజేశారు. సింధూర గురువారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications
