సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై మరో కేసు
హైదరాబాద్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై మరో కేసు నమోదైంది. తనను సురేష్ కొట్టాడని ఒక యువకుడు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో సురేష్ వద్ద ఈ యువకుడు కారు డ్రైవర్‌గా పని చేశాడు. తాను ఎయిర్ కూలర్ తీసికెళ్లానని ఆరోపిస్తూ సురేష్ తనను కొట్టాడని ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెల్లంకొండ సురేష్‌ను పిలిపించి బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు.
సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల్లో సురేష్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. తనపై బాలకృష్ణే కాల్పులు జరిపారని మొదట మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన సురేష్ ఆ తర్వాత మాట మార్చారు. తనపై కాల్పులు జరిపింది బాలకృష్ణ కాదని, కాల్పులు జరిపింది ఎవరో తెలియదని ఆయన చెప్పారు. దీంతో కోర్టులో బాలకృష్ణపై పోలీసులు పెట్టిన కేసు వీగిపోయంది.












Click it and Unblock the Notifications
