తెలియాలనే తెలంగాణపై ప్రకటన: దివాకర్ రెడ్డి
హైదరాబాద్: తన అభిప్రాయం తమ పార్టీ అధిష్ఠానవర్గానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాను తెలంగాణపై ప్రకటన చేశానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి చెప్పారు. ఖర్మ కాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఆయన ఇటీవల న్యూఢిల్లీలో చేసిన ప్రకటన దుమారం రేపింది. తెలంగాణపై తాను అధిష్ఠానవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తన ప్రకటనపై దుమారం చెలరేగడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఎవరి అభిప్రాయాలు వారివని ఆయన అన్నారు. తన అభిప్రాయం తాను వినిపించానని, తన అభిప్రాయం అధిష్ఠానవర్గానికి తెలియాలనే ఆ ప్రకటన చేశానని, మంచి చెడులు వారు ఆలోచిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications