తెలుగింటి కోడలు కాబోతున్న భాగ్యశ్రీ బోర్సే?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్, లవ్ రూమర్స్ అనేవి నిత్యం వినిపించే ముచ్చట్లే. అయితే, రీల్ లైఫ్ జోడీలు రియల్ లైఫ్‌లోనూ ఒక్కటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇలాగే రూమర్లతో మొదలై, చివరకు ఈ కన్నడ బ్యూటీ తెలుగింటి కోడలిగా అడుగుపెట్టడంతో ముగిసింది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ముచ్చటే టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి నెటిజన్ల ఫోకస్ అంతా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, సరికొత్త గ్లామర్ డాల్ భాగ్యశ్రీ బోర్సేలపై పడింది.

కోట్లు కొళ్లగొట్టిన చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..
కోట్లు కొళ్లగొట్టిన చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

మిస్టర్ బచ్చన్ తో పరిచయం

మహేష్ బాబు 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై భామ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, తన లుక్స్‌తో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన 'ఆంధ్రా కింగ్' సినిమాలో మెరిసింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు కానీ, వీరిద్దరి మధ్య మాత్రం బలమైన ప్రేమబంధాన్ని కుదిర్చిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. చివరికి భాగ్యశ్రీ కోసం రామ్ ఏకంగా పాటలు రాయడం, సింగర్‌గా మారడం కూడా చేశాడంటూ గుసగుసలు వినిపించాయి. ఈ వార్తలను రామ్ పైకి కొట్టిపారేసినప్పటికీ, లోపల ఏదో నడుస్తోందనే అనుమానాలు మాత్రం తగ్గలేదు.

Bhagyashree Borse Sparks Buzz Is She Set to Join a Telugu Family as a Daughter-in-Law

లెనిన్ లో నటిస్తోంది

ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తూ భాగ్యశ్రీ బోర్సే తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన 'లెనిన్' సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ టాక్ షోలో పాల్గొంది. ఈ క్రమంలో సుమ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. "నా మొదటి ఇల్లు ఔరంగాబాద్.. నా సెకండ్ హోమ్ హైదరాబాద్, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది" అంటూ ముసిముసి నవ్వులతో క్రేజీ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

అక్కినేని అభిమానులకు బిగ్ షాక్..
అక్కినేని అభిమానులకు బిగ్ షాక్..

భాగ్యశ్రీ నోటి వెంట వచ్చిన ఈ ఒక్క మాటతో రామ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ తన సొంత ఇల్లు అయిపోయిందంటూ ఆమె ఇచ్చిన హింట్, రామ్‌తో రిలేషన్‌ను పరోక్షంగా ఒప్పేసుకోవడమేనని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. రష్మిక లాగే భాగ్యశ్రీ కూడా త్వరలోనే తెలుగింటి కోడలు కాబోతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ లవ్ స్టోరీపై ఈ జంట అధికారికంగా ఎప్పుడు పెళ్లి కబురు చెప్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+