CBSE విద్యార్థులకు ఊరట! సుప్రీంకోర్టు కీలక తీర్పు

పశ్చిమాసియా (గల్ఫ్) దేశాలలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా సీబీఎస్‌ఈ (CBSE) క్లాస్ XII బోర్డు పరీక్షలు రద్దయి, తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రైవేట్ విద్యార్థులకు ఎట్టకేలకు పెద్ద ఊరట లభించింది. గల్ఫ్ దేశాలలోని ప్రైవేట్, ఇంప్రూవ్‌మెంట్ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక సరికొత్త జాతీయ అసెస్‌మెంట్ విధానాన్ని (National Policy) సుప్రీంకోర్టు సోమవారం రికార్డుల్లోకి తీసుకుంది. ఈ సమస్యపై దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి, జస్టిస్ విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అసలు వివాదం ఏంటి? సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థి

సౌదీ అరేబియాలోని అల్ జుబైల్‌కు చెందిన ప్రాన్షు జిగర్‌కుమార్ పటేల్ అనే సీబీఎస్‌ఈ ప్రైవేట్ అభ్యర్థి సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గల్ఫ్ సంక్షోభం కారణంగా అక్కడ పరీక్షలు రద్దు కావడంతో, రెగ్యులర్ విద్యార్థుల కోసం మార్చి 27, 2026న సీబీఎస్‌ఈ ఒక ప్రత్యేక అసెస్‌మెంట్ విధానాన్ని తెచ్చింది. కానీ, ప్రైవేట్ లేదా ఇంప్రూవ్‌మెంట్ రాసే అభ్యర్థుల ఫలితాల ప్రకటనపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా 'రిజల్ట్ లేటర్' అని నిలిపివేసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వివక్షాపూరితంగా ఉందని, తన పైచదువుల అవకాశాలను దెబ్బతీస్తోందని ఆ విద్యార్థి కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో స్పందించిన సుప్రీంకోర్టు.. ఒక పరిష్కారంతో రావాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

CBSE announces 40 60 assessment formula for private subjects

ప్రైవేట్ విద్యార్థుల కోసం సరికొత్త '40:60' మార్కుల ఫార్ములా

సుప్రీంకోర్టు విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై, జూన్ 21, 2026న నోటిఫై చేసిన సరికొత్త పాలసీ వివరాలను కోర్టుకు వివరించారు. రెగ్యులర్ విద్యార్థులకైతే ఇంటర్నల్ అసెస్‌మెంట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మార్కులు ఉంటాయి కానీ, ప్రైవేట్ విద్యార్థులకు ఎలాంటి స్కూల్ రికార్డులు ఉండవని, అందుకే ఈ ప్రత్యేక ఫార్ములాను తెచ్చామని చెప్పారు.

Nisarga Adhikary: CBSE లోపం బయటపెట్టాడు..! ఐఐటీ కాన్పూర్ ఆఫర్ కొట్టేశాడు..!
Nisarga Adhikary: CBSE లోపం బయటపెట్టాడు..! ఐఐటీ కాన్పూర్ ఆఫర్ కొట్టేశాడు..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్కుల విధానం:

రద్దయిన సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థి సాధించిన మార్కులను ఇలా లెక్కిస్తారు:

  • 40 శాతం మార్కులు: విద్యార్థి తన క్లాస్ X బోర్డు పరీక్షల థియరీలో సాధించిన మార్కుల నుంచి (అత్యధిక మార్కులు వచ్చిన టాప్ 3 సబ్జెక్టుల సగటు ఆధారంగా) తీసుకుంటారు.
  • 60 శాతం మార్కులు: విద్యార్థి తన క్లాస్ XII బోర్డు పరీక్షల థియరీలో సాధించిన మార్కుల ఆధారంగా లెక్కిస్తారు.

పిటిషన్ వేసిన విద్యార్థి విషయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలు జరిగాయి కాబట్టి వాటికి అసలు మార్కులు వేశారు. రద్దయిన మ్యాథ్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు ఈ కొత్త ఫార్ములాను వర్తింపజేశారు. దీనివల్ల ఆ విద్యార్థికి గతంలో కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని, ఫలితాలను ఈమెయిల్ ద్వారా పంపామని, డిజీలాకర్‌లోనూ అప్‌డేట్ చేస్తామని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

CBSE: ఇక బోర్డు సొంత సర్వర్లలోనే, వెండర్ సర్వర్లకు భారీ షాక్!
CBSE: ఇక బోర్డు సొంత సర్వర్లలోనే, వెండర్ సర్వర్లకు భారీ షాక్!

సంతృప్తి చెందకపోతే మళ్లీ పరీక్ష రాసుకోవచ్చు

ఈ కొత్త విధానం ప్రకారం ప్రకటించిన మార్కుల పట్ల ఏ విద్యార్థి అయినా సంతృప్తి చెందకపోతే, వారు తదుపరి నిర్వహించే రెగ్యులర్ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కూడా ఈ పాలసీలో కల్పించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఫలితాలు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే, ఆన్సర్ స్క్రిప్ట్‌ల కాపీలు, రీ-ఎవల్యూషన్ కోరుకునే హక్కును కాపాడాలని కోరారు. అయితే, ఈ అంశాలు అసలు పిటిషన్‌లో లేవని ధర్మాసనం పేర్కొంది.

పరీక్షలకు సంబంధించిన వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపబోమని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురావడం, పిటిషనర్ సమస్య పరిష్కారం కావడంతో ఈ కేసును కోర్టు ముగించింది (డిస్పోజ్ చేసింది). విద్యార్థికి ఇంకా ఏవైనా చట్టపరమైన సమస్యలు ఉంటే, స్వతంత్రంగా తగిన మార్గాల్లో వెళ్లవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+