గ్రామాన్ని దిగ్బంధనం చేసిన నక్సలైట్లు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా జికె మండలంలోని దుప్పులవాడ గ్రామాన్ని మావోయిస్టు నక్సలైట్లు గురువారం అర్థరాత్రి దిగ్బంధనం చేశారు. గిరిజన సహకారం సంఘం కార్యాలయంపై దాడి చేసి పనికి ఆహారం పథకం బియ్యాన్ని వారు ప్రజలకు పంచిపెట్టారు. సీలేరు నుంచి నర్సీపట్నం వెళ్తున్న అంబులెన్స్‌ను మార్గమధ్యంలో నక్సలైట్లు ఆపేశారు. దీంతో అంబులెన్స్‌లోని రోగి ఆస్పత్రికి చేర్చేలోగానే మరణించాడు. చిత్రకోణం వైపు నుంచి వస్తున్న జీపుపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. మార్గమధ్యంలో ఆగిపోయిన వాహనాల ప్రయాణికులను ఉద్దేశించి నక్సలైట్లు ప్రసంగించారు. ఈ సంఘటనలో దాదాపు 30 మంది సాయుధ నక్సలైట్లు పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న రెండు ఆర్టీసి బస్సులను నిలిపి ఆ బస్సుల్లో పోలీసులు ఉన్నారా, లేదా అని పరిశీలించారు.












Click it and Unblock the Notifications