ఇల్లందులో 19 మంది నక్సల్స్ లొంగుబాటు
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందులో వివిధ గ్రూపులకు చెందిన 19 మంది నక్సలైట్లు శుక్రవారం పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) భావనా సక్సేనా ముందు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో నలుగురు ప్రజా ప్రతిఘటనకు, ముగ్గురు ప్రతిఘటన గ్రూపునకు, ముగ్గురు సిపియుయస్‌ఐకి, ఏడుగురు జనశక్తికి చెందిన నక్సలైట్లు. లొంగిపోయినవారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు.
ఇంత పెద్ద యెత్తున నక్సలైట్లు లొంగిపోవడం పట్ల ఎస్పీ భావనా సక్సేనా హర్షం వ్యక్తం చేశారు. నక్సలైట్లను ఎన్‌కౌంటర్లలో చంపడం తమకేమీ ఇష్టం కాదని, తాము తమ విధులను నిర్వర్తిస్తున్నామని ఆమె అన్నారు. లొంగిపోయిన నక్సలైట్ల సహాయం అందజేస్తామని ఆమె చెప్పారు. జన జీవన స్రవంతిలోకి రావాలని తాము నక్సలైట్లకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications