రెండు వారాల్లో నివేదికకు కెసిఆర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తెలంగాణపై నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) అధినేత, కేంద్ర కార్మిక మంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రణబ్ ముఖర్జీని కోరారు. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో తెలంగాణపై ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నియమించిన త్రిసభ్య ఉప సంఘం తొలి సమావేశంలో శుక్రవారంనాడు జరిగింది. ఈ సమావేశంలో ప్రణబ్ ముఖర్జీతో పాటు సంఘం సభ్యుడు, రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు రఘువంశరాయ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో సభ్యుడైన మరో కేంద్ర మంత్రి, డియంకె నాయకుడు దయానిధి మారన్ హాజరు కాలేదు. తమిళనాడులోని ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున ఆయన ఈ సమావేశానికి రాలేకపోయారు.
టి ఆర్‌యస్ అగ్రనేతలు కెసిఆర్, ఎ. నరేంద్రలతోపాటు పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు తమ వాదనలను వినిపించారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ సమావేశాల సందర్భంగా తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయాలను రాబట్టి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కెసిఆర్ ప్రణబ్ ముఖర్జీని కోరారు. అందుకు ప్రణబ్ సుముఖంగా ప్రతిస్పందించారు. తెలంగాణపై ఈ ప్రాంత మేధావులు రూపొందించిన సిడిని టి ఆర్‌యస్ నాయకులు కమిటీ సభ్యుల ఎదుట ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications