నారా లోకేష్ ఎంట్రీ.. అమరావతిలో బాలయ్య రచ్చ!

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సరికొత్త చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం #NBK112' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే మాస్ ఆడియన్స్‌లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్టు అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 25వ తేదీన అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిదధ టీటీడీ దేవాలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. సినిమా లాంచ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో నందమూరి అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Nara Lokesh to Attend NBK112 Grand Launch with Koratala Siva in Amaravati scheduled for June 25

అయితే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ అతిథులుగా హాజరుకానుండటం విశేషం. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య ఘట్టానికి హాజరవుతుండటంతో ఈ ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ లాంచ్ వేడుక కన్నులపండువగా జరగనుంది.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 111వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన వెంటనే, కొరటాల శివ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం బాలయ్య సరికొత్త మేకోవర్‌తో సిద్ధం కానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+